6, జూన్ 2011, సోమవారం

స్వేచ్ఛ

స్వార్థమనే పెను చీకటి మనసుని ఆవహించి
అసత్యం నా నాలిక పై తాండవం ఆడింది!
క్రూరత్వం మానవత్వం పై పంజా విసిరింది!
జాలి లేని నా మనసు వికటాట్టహాసం చేసింది!!

మంచిని హేళన చేస్తూ!
శాంతిని కనుమరుగు పరుస్తూ!
అరాచకం ప్రభలిస్తూ!
దుర్మార్గం కొమ్ము కాస్తూ!!

సాగిన నా జీవన పయనంలో
వికసమే లేక, ఈ ప్రపంచాన్ని చూడనీక
అహం నా మనసుని కప్పేసింది!
చుట్టూ చీకట్లను నింపేసింది!!

ఏ ఉదయం నన్ను తట్టి లేపిందో
ఏ కిరణం నను చురుకున తాకిందో
ఆ ప్రభాత కిరణపు పలకరింపు
మనసును ఆవహించిన నిశను తరిమి కొట్టింది
కాళ రాత్రి పీడకలలను మట్టు పెట్టింది
అల్లుకున్న అహం అంతు చూసింది!

బందీ విడిన మనసు స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తూ
స్వార్థపు చీకట్లను తొలిగించి కాస్త ప్రపంచాన్ని చూస్తూ
మంచిని అన్వేషిస్తూ
మానవత్వాన్ని సోధిస్తూ
సంఘం ఎక్కడ ఛీ కొడుతుందో అని సందేహంతో
సిగ్గుపడుతూ,పశ్చాతాప పడుతూ
పూర్తి వెలుతురుని తట్టుకోలేక
తలుపులు తెరుస్తూ మూస్తూ
మనసు మౌనంగా రోదించింది!

గతం సింహావలోకనం చేసుకుంటే!

ఏముంది!

స్వార్థానికి నా మనసు బందీ అయ్యింది!
నేను అన్న అహం నరనరాలా నర్తించింది!
మార్గమే లేక జీవిత పయనం సాగింది!
శాంతిని కోల్పోయింది!

ఆ పొద్దు ఏమి జరిగిందో!
బరువెక్కిన హ్రుదయం తేలికయ్యింది!
మనసు తనకు తానే ప్రశ్నించుకుంది!
జీవన గమ్యం తెలుసుకోమంది!

స్వార్థం చెరనుండి విముక్తి కోరింది!
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఆహ్వానం పంపింది!!

1 కామెంట్‌: