25, ఆగస్టు 2019, ఆదివారం
18, ఆగస్టు 2019, ఆదివారం
నిరంతర ప్రయత్నం
నిద్రావస్థ నుంచి నా మస్తిష్కం మేలుకొంది
నిక్షిప్త మైన ఎన్నో భావాల్ని వెలికి తీసింది
ఎడారిలా మారిన నా మనసును పూల వనం లా మార్చింది
మోడు లా పడివున్న శరీరంలో కొత్త కదలికలు తెచ్చింది
ఒక్కసారిగా
ఎన్నో ఊహలు ! ఎన్నెన్నో ఆశలు !
నాడులను ప్రేరేపిస్తూ , నర నరాల ఉత్తేజం నింపుతూ
ఎన్నడూలేని శక్తి నను ఆవహించింది
నెత్తుటిని ఉడికించి , ఆలోచనల్ని ఉరికించి
నన్ను నా లక్ష్యం వైపు పరుగులు తీయించింది
ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం !
దారిన పరుగెడుతుంటే అనేక మార్గాలు ,
మరెన్నో ప్రలోభాలు !
ఎన్నెన్నో అవరోధాలు !
కానీ నాలోని పట్టుదల
చురుక్కుమంటూ నా మనస్సుని ఉత్తేజపరుస్తూ !
కళ్ళకు వేరే దారి కనపడనీయక !
లక్ష్యం వైపే ద్రుష్టిని నిలిపేట్టు చేసింది!
పరిగెడుతూ బొక్క బోర్లా పడినా!
కాలికి ఎన్నో గాయాలైన!
అవి మనసు దాకా చేరనీక !
ఏకాగ్రతతో ముందుకు వెళుతుంటే !
ఓ మహోగ్ర గాలివాన విజృంభించి!
వెనక్కు తోస్తూ !
పడవేస్తూ !
కంటి రెప్పలు తెరవనీయకుండా చేస్తూ
దారిని కనుమరుగు చేస్తూ!
నన్ను కబళించి!!
హేళన చేస్తూ!
ఎదురొడ్డలేక అలిసిపోయేలా చేస్తూ!
ఇక ఆగిపోదామా అనేలా ఊహలు ప్రేరేపిస్తూ !
విలయ తాండవం చేసింది!
మనసు కకలా వికలము అయ్యేలా గర్జించి వెలిసింది !
మళ్ళీ ఓ నిరాశ , నిస్పృహ !
కూడగట్టుకున్న శక్తంతా మటుమాయం !
ముందుకు కదిలే ఓపిక లేక !
వెనక్కి వెల్ల లేక
మస్తిష్కం మళ్ళీ స్తంభించింది !
తీవ్ర మైన నైరాశ్యం మిగిల్చింది !
ఈ లోగా ఎదో ఆలోచన !
ముందుకెళ్ల లేక ఆగితే ఎలా ?
చేతకాదు అంటుంది ఈ సంఘం !
వెనక్కి వెళితే ఓడామని గేళి చేస్తుంది ఈ సమాజం .
ఈ సంఘం తో నాకెందుకు !!
గాలివానకు తల్లడిల్లుతుంటే గొడుగు పట్టిందా ఈ సమాజం !
నిద్రావస్థలో నున్నప్పుడు తట్టి లేపిందా ఈ సంఘం!
వారి వెక్కిరింతలకు నేనెందుకు స్పందించాలి!
గెలుపులో సహకరించక ఓటమిని ఎత్తి చూపే
వీరితో నాకేం పని !!
అనుకుంటూ కూలబడిన మనస్సు ......
అలలతో హోరెత్తుతున్న సముద్రమైంది !
గాలివానకు నేల రాలిన మహా వృక్ష మైంది !
ఈలోగా
చిన్న రెక్కలతో గాలిలోకి ఎగిరే పక్షి
చిరు దేహంతో సముద్రాన్ని ఈదే చేప
మండే ఎండకు మోడై వానకు చిగురించే చెట్టు
పరిశ్రమించి గంగను నేలకు దించిన భగీరధుడు
వదులుకోని ఓరిమితో పతి ప్రాణాలను కాపాడిన సావిత్రి
ఆత్మవిశ్వాసం తో దేశం నలుమూలలా తన ఉనికి చాటిన ఆది శంకరుడు !
మనస్సును తట్టి......
శక్తిని కూడగట్టి !
అడుగులో అడుగేస్తూ!
గమ్యం వైపే గమనాన్ని సాగిస్తూ !
ధైర్యం మనసున నింపి !
ఓరిమితో గెలుపుకై ప్రయత్నిస్తూ విజయ తీరాలను చేరాను !
ఆనందపు అంబరాన విహరించాను !!
నిరంతరం పరిశ్రమిస్తూ ముందుకు సాగితే విజయం వరిస్తుంది . నీ లక్ష్యం సిద్ధిస్తుంది .
16, ఆగస్టు 2013, శుక్రవారం
మార్పు రాదా
ఒక కర్షకుడు స్వేదాన్ని చిందించి
భూమి తల్లిని తడిపి పండించిన సిరిని
తనకూ, సమాజానికి అందజేస్తాడు.
ఒక ఉపాద్యాయుడు తన మేధస్సు
తన ఉదరపొషణకై ఉపయోగిస్తూనే
పరుల జీవితాలలో వెలుగులు నింపుతాడు.
ఒక వైజ్ఞానికుడు తన విజ్ఞానాన్ని
పణంగా పెట్టి సమాజానికి ఎన్నో
అందించి మేలు చేస్తాడు
ఓ కుమ్మరి,
కమ్మరి,
కార్మికుడు
వీరందరూ తమను తాము చూసుకుంటూ
దేశానికి, సమజానికి ఏదో రూపంలో
తమ సేవలను అందిస్తూనే ఉంటారు
మరి,
పజల నమ్మకాలతో, సమాజ ప్రోద్బలంతో
గద్దెనెక్కిన నాయకులు
చేసిన వాగ్దానాలు మరచి,
చేయూత నందించిన ప్రజలను విడచి
వారి నమ్మకాలను సొమ్ము చేసుకుంటూ
దేశాన్ని ఇలా దోచుక తింటున్నారు!
వారి తీరు ఇంతేనా?
ఏ క్షణానికి ఏ రంగు మారుస్తారో
ఏ పూటకి ఏ గూడు చేరుతారో
ఏ రోజు ఎవరి పుట్టి ముంచుతారో
ఎప్పుడు ఎలా స్పందిస్తారో!!
నిన్నటి బద్ద శత్రువు వారికి
నేడు మంచి మిత్రుడు!
నిన్నటి కటిక నిజం వారికి
నేడు అబద్దం!
చెప్పింది చేయడం వారి లక్షణం కాదు
నమ్మించి గొంతుకలు కోయడం వారి నైజం!
అభివృద్దికి బాటలు వేయటం వారి తీరు కాదు
ఎదిరించిన వారిని అణగతొక్కడం వారికి సహజం!
ఏదో చేద్దామని ఆలోచనే రాదా?
వీరిలో మార్పు అనేది రాదా?
భూమి తల్లిని తడిపి పండించిన సిరిని
తనకూ, సమాజానికి అందజేస్తాడు.
ఒక ఉపాద్యాయుడు తన మేధస్సు
తన ఉదరపొషణకై ఉపయోగిస్తూనే
పరుల జీవితాలలో వెలుగులు నింపుతాడు.
ఒక వైజ్ఞానికుడు తన విజ్ఞానాన్ని
పణంగా పెట్టి సమాజానికి ఎన్నో
అందించి మేలు చేస్తాడు
ఓ కుమ్మరి,
కమ్మరి,
కార్మికుడు
వీరందరూ తమను తాము చూసుకుంటూ
దేశానికి, సమజానికి ఏదో రూపంలో
తమ సేవలను అందిస్తూనే ఉంటారు
మరి,
పజల నమ్మకాలతో, సమాజ ప్రోద్బలంతో
గద్దెనెక్కిన నాయకులు
చేసిన వాగ్దానాలు మరచి,
చేయూత నందించిన ప్రజలను విడచి
వారి నమ్మకాలను సొమ్ము చేసుకుంటూ
దేశాన్ని ఇలా దోచుక తింటున్నారు!
వారి తీరు ఇంతేనా?
ఏ క్షణానికి ఏ రంగు మారుస్తారో
ఏ పూటకి ఏ గూడు చేరుతారో
ఏ రోజు ఎవరి పుట్టి ముంచుతారో
ఎప్పుడు ఎలా స్పందిస్తారో!!
నిన్నటి బద్ద శత్రువు వారికి
నేడు మంచి మిత్రుడు!
నిన్నటి కటిక నిజం వారికి
నేడు అబద్దం!
చెప్పింది చేయడం వారి లక్షణం కాదు
నమ్మించి గొంతుకలు కోయడం వారి నైజం!
అభివృద్దికి బాటలు వేయటం వారి తీరు కాదు
ఎదిరించిన వారిని అణగతొక్కడం వారికి సహజం!
ఏదో చేద్దామని ఆలోచనే రాదా?
వీరిలో మార్పు అనేది రాదా?
కవి హ్రుదయం
కవి హ్రుదయం
ఆనందాన్నీ తాకి చూస్తుంది
ఆర్థతనూ అనుభవిస్తుంది
కవి హ్రుదయం
అంబరానా పయనిస్తుంది
పాతాళానా నిలుస్తుంది
కవి హ్రుదయం
భవంతుల్లో సంచరిస్తుంది
మురికివాడల్లోనూ మసలుతుంది
కవి హ్రుదయం
సుఖామృతాన్నీ సేవిస్తుంది
హాలహలాన్నీ హరిస్తుంది
కష్టాల కడలినీ ఈదుతుంది
ముళ్ళ బాటనైనా పయనిస్తుంది
కవి హ్రుదయం
ప్రకృతి అందాలను వర్ణిస్తుంది
మగువల చందాలనీ కీర్తిస్తుంది
భూ ప్రళయాలనూ వీక్షిస్తుంది
బడభాగ్నులనూ అనుభవిస్తుంది
కవి హ్రుదయం
చంద్రుని వెన్నెల సొగసులనూ
సూర్యుని వెలుగు రేఖలనూ
కాలం మార్చే రంగులనూ
అన్నింటినీ చూస్తుంది
కవి హ్రుదయం
కర్షకుడు చిందించిన స్వేదాన్ని
కార్మికుడు అనుభవిస్తున్న కస్టాన్ని
జూదరి వెంట వున్న వ్యసనాన్ని
దేన్నీ వదలదు
కవి హ్రుదయం
కాంచని చోటులేదు
వర్ణించని విషయం లేదు
అనుభవించని భావం లేదు
అందుకోని ఎత్తులు లేవు
చేరుకోని లోతులు లేవు
శ్రీ శ్రీ అన్నట్లు అగ్గిపిల్ల కుక్కపిల్ల .... ఇవేవీ కవితకు అనర్హం కావు. ఉండాలొయి కవితావేసం, కావలొయి రస నిర్దేశం.
ఆనందాన్నీ తాకి చూస్తుంది
ఆర్థతనూ అనుభవిస్తుంది
కవి హ్రుదయం
అంబరానా పయనిస్తుంది
పాతాళానా నిలుస్తుంది
కవి హ్రుదయం
భవంతుల్లో సంచరిస్తుంది
మురికివాడల్లోనూ మసలుతుంది
కవి హ్రుదయం
సుఖామృతాన్నీ సేవిస్తుంది
హాలహలాన్నీ హరిస్తుంది
కష్టాల కడలినీ ఈదుతుంది
ముళ్ళ బాటనైనా పయనిస్తుంది
కవి హ్రుదయం
ప్రకృతి అందాలను వర్ణిస్తుంది
మగువల చందాలనీ కీర్తిస్తుంది
భూ ప్రళయాలనూ వీక్షిస్తుంది
బడభాగ్నులనూ అనుభవిస్తుంది
కవి హ్రుదయం
చంద్రుని వెన్నెల సొగసులనూ
సూర్యుని వెలుగు రేఖలనూ
కాలం మార్చే రంగులనూ
అన్నింటినీ చూస్తుంది
కవి హ్రుదయం
కర్షకుడు చిందించిన స్వేదాన్ని
కార్మికుడు అనుభవిస్తున్న కస్టాన్ని
జూదరి వెంట వున్న వ్యసనాన్ని
దేన్నీ వదలదు
కవి హ్రుదయం
కాంచని చోటులేదు
వర్ణించని విషయం లేదు
అనుభవించని భావం లేదు
అందుకోని ఎత్తులు లేవు
చేరుకోని లోతులు లేవు
శ్రీ శ్రీ అన్నట్లు అగ్గిపిల్ల కుక్కపిల్ల .... ఇవేవీ కవితకు అనర్హం కావు. ఉండాలొయి కవితావేసం, కావలొయి రస నిర్దేశం.
కాలంతో పరుగు
కాల చక్రం గిర్రున తిరుగుతుంది
మూడు కాలాలు, ఆరు ఋతువులూ
నీ కోసం ఆగవు, నీకేసీ చూడవు
నీవే వాటితో పరుగు తీయాలి
అలసిపోయి కూర్చున్నా, సోమరివై
కదలకున్నా కాలం నీకై ఆగదు
అయ్యో పాపమూ అనదు
తన పయనంలో తానుంటుంది
నీ జీవిత పయనం దానికి అనవసరం
నీలాంటి వారెందరో ఈ ప్రపంచంలో
మూడు కాలాల రుచి చవి చూడవలసిందే
ఆరు ఋతువుల క్రమాన్నీ కాంచవలసిందే
మరి నీలో నైరాశ్యం ఎందుకు
కాలంతో పరుగు తీయి
ఏ కాలానికి ఆ కాలం విధి నిర్వర్తించు
ఏ ఋతువుకు ఆ రంగు మార్చు
ఈ జీవిత రంగస్థలంలో రంగు మార్చి
అన్ని వేషాలు కట్టు , అన్ని పాత్రలూ పోషించు
అందరినీ మెప్పించు
అప్పుడే నీకు పరిపూర్ణత!
నీ జీవితానికి సార్థకత!!
మూడు కాలాలు, ఆరు ఋతువులూ
నీ కోసం ఆగవు, నీకేసీ చూడవు
నీవే వాటితో పరుగు తీయాలి
అలసిపోయి కూర్చున్నా, సోమరివై
కదలకున్నా కాలం నీకై ఆగదు
అయ్యో పాపమూ అనదు
తన పయనంలో తానుంటుంది
నీ జీవిత పయనం దానికి అనవసరం
నీలాంటి వారెందరో ఈ ప్రపంచంలో
మూడు కాలాల రుచి చవి చూడవలసిందే
ఆరు ఋతువుల క్రమాన్నీ కాంచవలసిందే
మరి నీలో నైరాశ్యం ఎందుకు
కాలంతో పరుగు తీయి
ఏ కాలానికి ఆ కాలం విధి నిర్వర్తించు
ఏ ఋతువుకు ఆ రంగు మార్చు
ఈ జీవిత రంగస్థలంలో రంగు మార్చి
అన్ని వేషాలు కట్టు , అన్ని పాత్రలూ పోషించు
అందరినీ మెప్పించు
అప్పుడే నీకు పరిపూర్ణత!
నీ జీవితానికి సార్థకత!!
విజయం
నేడంటే నిజమనుకుంటే
రేపంటూ ఉంది అనుకుంటూ
మనసంతా ఉత్సాహంతో
నిండైన ఆత్మ విశ్వాసంతో
ముందుకు నడువు
విజయం వరించినా
పరాజయం పరాభవించినా
నీదైన శైలిలో పయనించు
అలుముకున్న నైరాశ్యాన్ని జయించు
జంకులేక నడక సాగించు
దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి
కొత్త నేస్తాలు కలుస్తాయి
నీ విజయాన్ని చూసి ఈర్ష పడేవారు
వెన్ను తట్టి స్పూర్తి నిచ్చేవారు
నిన్ను అభినందించి, ఆనందించేవారు
నీవు ఎవరినీ మరువకు
ఆ ఈర్షా ద్వేషాలు నీలో
కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి
గెలిచి తీరాలి అన్న
పట్టుదల పెంచాలి
అభినందనలకు పొంగక
సాధించేది చాలా ఉంది అనుకుంటూ
లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ
అలుపన్నది ఎరుగక గెలుపు సాధించు
చేరుకున్న ఎత్తులు
అందుకున్న అందలాలతో
పొంగిపోయి, నీవే గొప్పంటూ
బడాయి కొట్టబోకు
ఆధారం లేనిదే ఆ ఎత్తుల్లో
నీవు నిలబడలేవు
ఆధారం భూమి మీద ఉంది
దాన్ని మరువకు
దాన్ని మరిచావో
ఎప్పుడోకప్పుడు ముప్పు తప్పదు
ఒక్కసారిగా ఆ విజయాలు అన్నీ
మాయమై మరుక్షణం
నీవు నేలపై పడతావు
ఇక్కడ నిన్ను ఆదరించే వారుండరు
చేయూత నివ్వకపోగా చెడు మాట్లడుతారు
సహాయం చెయ్యకపోగా చీదరించుకుంటారు
నీవెక్కిన ఎత్తులు నీతోటి వారికి
మెట్లుగా మార్చాలి
వారినీ మంచి స్థాయికి తేవడానికి పాటు పడాలి
అపుడే విజయానికి సార్థకత
ఆ విజయపు ఫలాన్ని తోటి వారికి
పంచినపుడే నీ జీవితంలో గొప్ప విజయం!!!
రేపంటూ ఉంది అనుకుంటూ
మనసంతా ఉత్సాహంతో
నిండైన ఆత్మ విశ్వాసంతో
ముందుకు నడువు
విజయం వరించినా
పరాజయం పరాభవించినా
నీదైన శైలిలో పయనించు
అలుముకున్న నైరాశ్యాన్ని జయించు
జంకులేక నడక సాగించు
దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి
కొత్త నేస్తాలు కలుస్తాయి
నీ విజయాన్ని చూసి ఈర్ష పడేవారు
వెన్ను తట్టి స్పూర్తి నిచ్చేవారు
నిన్ను అభినందించి, ఆనందించేవారు
నీవు ఎవరినీ మరువకు
ఆ ఈర్షా ద్వేషాలు నీలో
కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి
గెలిచి తీరాలి అన్న
పట్టుదల పెంచాలి
అభినందనలకు పొంగక
సాధించేది చాలా ఉంది అనుకుంటూ
లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ
అలుపన్నది ఎరుగక గెలుపు సాధించు
చేరుకున్న ఎత్తులు
అందుకున్న అందలాలతో
పొంగిపోయి, నీవే గొప్పంటూ
బడాయి కొట్టబోకు
ఆధారం లేనిదే ఆ ఎత్తుల్లో
నీవు నిలబడలేవు
ఆధారం భూమి మీద ఉంది
దాన్ని మరువకు
దాన్ని మరిచావో
ఎప్పుడోకప్పుడు ముప్పు తప్పదు
ఒక్కసారిగా ఆ విజయాలు అన్నీ
మాయమై మరుక్షణం
నీవు నేలపై పడతావు
ఇక్కడ నిన్ను ఆదరించే వారుండరు
చేయూత నివ్వకపోగా చెడు మాట్లడుతారు
సహాయం చెయ్యకపోగా చీదరించుకుంటారు
నీవెక్కిన ఎత్తులు నీతోటి వారికి
మెట్లుగా మార్చాలి
వారినీ మంచి స్థాయికి తేవడానికి పాటు పడాలి
అపుడే విజయానికి సార్థకత
ఆ విజయపు ఫలాన్ని తోటి వారికి
పంచినపుడే నీ జీవితంలో గొప్ప విజయం!!!
సత్యాలు
మరువరానిది!
తల్లి ప్రేమ
తండ్రి త్యాగం
గురువు విద్యా భోధన
మిత్రుని స్నేహం
ఇతరులు చేసిన సాయం
చేయల్సిన కార్యం
ఆరాధింపవలసినవి!
ప్రకృతిని
కాలన్ని
మంచిమనసుని
నమ్మవలసినవి!
ఆత్మస్థైర్యం
క్రమశిక్షణ
ధర్మం
శ్రమ
శక్తి
తోటి మానవుడు
కదిలింపరానివి!
నిదురించే సింహం
ఆవేశం లో నున్న మనిషి
మూలం (ఆధారం) లేని విషయం
భరింపరానివి!
ఆకలి
మోసం
అన్యాయం
ఊహకందనవి!
జీవితం
ఆత్మ
దైవం
ఊహింపరానివి!
భయం
ద్వేషం
అసూయ
ఆరాధింపరానివి!
కామ
క్రోధ
లోభ
మోహ
మద
మాత్సర్యాలు
తల్లి ప్రేమ
తండ్రి త్యాగం
గురువు విద్యా భోధన
మిత్రుని స్నేహం
ఇతరులు చేసిన సాయం
చేయల్సిన కార్యం
ఆరాధింపవలసినవి!
ప్రకృతిని
కాలన్ని
మంచిమనసుని
నమ్మవలసినవి!
ఆత్మస్థైర్యం
క్రమశిక్షణ
ధర్మం
శ్రమ
శక్తి
తోటి మానవుడు
కదిలింపరానివి!
నిదురించే సింహం
ఆవేశం లో నున్న మనిషి
మూలం (ఆధారం) లేని విషయం
భరింపరానివి!
ఆకలి
మోసం
అన్యాయం
ఊహకందనవి!
జీవితం
ఆత్మ
దైవం
ఊహింపరానివి!
భయం
ద్వేషం
అసూయ
ఆరాధింపరానివి!
కామ
క్రోధ
లోభ
మోహ
మద
మాత్సర్యాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)