నేడంటే నిజమనుకుంటే
రేపంటూ ఉంది అనుకుంటూ
మనసంతా ఉత్సాహంతో
నిండైన ఆత్మ విశ్వాసంతో
ముందుకు నడువు
విజయం వరించినా
పరాజయం పరాభవించినా
నీదైన శైలిలో పయనించు
అలుముకున్న నైరాశ్యాన్ని జయించు
జంకులేక నడక సాగించు
దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి
కొత్త నేస్తాలు కలుస్తాయి
నీ విజయాన్ని చూసి ఈర్ష పడేవారు
వెన్ను తట్టి స్పూర్తి నిచ్చేవారు
నిన్ను అభినందించి, ఆనందించేవారు
నీవు ఎవరినీ మరువకు
ఆ ఈర్షా ద్వేషాలు నీలో
కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి
గెలిచి తీరాలి అన్న
పట్టుదల పెంచాలి
అభినందనలకు పొంగక
సాధించేది చాలా ఉంది అనుకుంటూ
లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ
అలుపన్నది ఎరుగక గెలుపు సాధించు
చేరుకున్న ఎత్తులు
అందుకున్న అందలాలతో
పొంగిపోయి, నీవే గొప్పంటూ
బడాయి కొట్టబోకు
ఆధారం లేనిదే ఆ ఎత్తుల్లో
నీవు నిలబడలేవు
ఆధారం భూమి మీద ఉంది
దాన్ని మరువకు
దాన్ని మరిచావో
ఎప్పుడోకప్పుడు ముప్పు తప్పదు
ఒక్కసారిగా ఆ విజయాలు అన్నీ
మాయమై మరుక్షణం
నీవు నేలపై పడతావు
ఇక్కడ నిన్ను ఆదరించే వారుండరు
చేయూత నివ్వకపోగా చెడు మాట్లడుతారు
సహాయం చెయ్యకపోగా చీదరించుకుంటారు
నీవెక్కిన ఎత్తులు నీతోటి వారికి
మెట్లుగా మార్చాలి
వారినీ మంచి స్థాయికి తేవడానికి పాటు పడాలి
అపుడే విజయానికి సార్థకత
ఆ విజయపు ఫలాన్ని తోటి వారికి
పంచినపుడే నీ జీవితంలో గొప్ప విజయం!!!
రేపంటూ ఉంది అనుకుంటూ
మనసంతా ఉత్సాహంతో
నిండైన ఆత్మ విశ్వాసంతో
ముందుకు నడువు
విజయం వరించినా
పరాజయం పరాభవించినా
నీదైన శైలిలో పయనించు
అలుముకున్న నైరాశ్యాన్ని జయించు
జంకులేక నడక సాగించు
దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి
కొత్త నేస్తాలు కలుస్తాయి
నీ విజయాన్ని చూసి ఈర్ష పడేవారు
వెన్ను తట్టి స్పూర్తి నిచ్చేవారు
నిన్ను అభినందించి, ఆనందించేవారు
నీవు ఎవరినీ మరువకు
ఆ ఈర్షా ద్వేషాలు నీలో
కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి
గెలిచి తీరాలి అన్న
పట్టుదల పెంచాలి
అభినందనలకు పొంగక
సాధించేది చాలా ఉంది అనుకుంటూ
లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ
అలుపన్నది ఎరుగక గెలుపు సాధించు
చేరుకున్న ఎత్తులు
అందుకున్న అందలాలతో
పొంగిపోయి, నీవే గొప్పంటూ
బడాయి కొట్టబోకు
ఆధారం లేనిదే ఆ ఎత్తుల్లో
నీవు నిలబడలేవు
ఆధారం భూమి మీద ఉంది
దాన్ని మరువకు
దాన్ని మరిచావో
ఎప్పుడోకప్పుడు ముప్పు తప్పదు
ఒక్కసారిగా ఆ విజయాలు అన్నీ
మాయమై మరుక్షణం
నీవు నేలపై పడతావు
ఇక్కడ నిన్ను ఆదరించే వారుండరు
చేయూత నివ్వకపోగా చెడు మాట్లడుతారు
సహాయం చెయ్యకపోగా చీదరించుకుంటారు
నీవెక్కిన ఎత్తులు నీతోటి వారికి
మెట్లుగా మార్చాలి
వారినీ మంచి స్థాయికి తేవడానికి పాటు పడాలి
అపుడే విజయానికి సార్థకత
ఆ విజయపు ఫలాన్ని తోటి వారికి
పంచినపుడే నీ జీవితంలో గొప్ప విజయం!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి