18, ఆగస్టు 2019, ఆదివారం

నిరంతర ప్రయత్నం



నిద్రావస్థ  నుంచి    నా మస్తిష్కం   మేలుకొంది

నిక్షిప్త  మైన  ఎన్నో  భావాల్ని  వెలికి  తీసింది 

ఎడారిలా మారిన  నా మనసును  పూల  వనం  లా  మార్చింది

మోడు లా పడివున్న  శరీరంలో కొత్త  కదలికలు  తెచ్చింది 

ఒక్కసారిగా

ఎన్నో ఊహలు !  ఎన్నెన్నో  ఆశలు !

నాడులను  ప్రేరేపిస్తూ , నర నరాల  ఉత్తేజం  నింపుతూ 

ఎన్నడూలేని   శక్తి  నను  ఆవహించింది

నెత్తుటిని ఉడికించి , ఆలోచనల్ని  ఉరికించి 

నన్ను నా  లక్ష్యం  వైపు  పరుగులు  తీయించింది

ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం  !

దారిన  పరుగెడుతుంటే  అనేక   మార్గాలు  ,
మరెన్నో  ప్రలోభాలు !
ఎన్నెన్నో అవరోధాలు  !

కానీ నాలోని  పట్టుదల 

చురుక్కుమంటూ నా మనస్సుని  ఉత్తేజపరుస్తూ  !

 కళ్ళకు   వేరే దారి   కనపడనీయక !

లక్ష్యం వైపే  ద్రుష్టిని నిలిపేట్టు చేసింది!

పరిగెడుతూ బొక్క బోర్లా  పడినా!
కాలికి  ఎన్నో గాయాలైన!
అవి  మనసు దాకా  చేరనీక  !

ఏకాగ్రతతో  ముందుకు  వెళుతుంటే !

ఓ మహోగ్ర  గాలివాన  విజృంభించి!

వెనక్కు  తోస్తూ  !
పడవేస్తూ !

కంటి  రెప్పలు  తెరవనీయకుండా  చేస్తూ
దారిని  కనుమరుగు   చేస్తూ!

నన్ను కబళించి!!

హేళన  చేస్తూ!
ఎదురొడ్డలేక అలిసిపోయేలా చేస్తూ!

ఇక ఆగిపోదామా అనేలా ఊహలు ప్రేరేపిస్తూ !

విలయ తాండవం చేసింది!

మనసు కకలా వికలము అయ్యేలా గర్జించి వెలిసింది !


  మళ్ళీ ఓ నిరాశ , నిస్పృహ !

 కూడగట్టుకున్న శక్తంతా మటుమాయం !

ముందుకు కదిలే ఓపిక లేక !

వెనక్కి వెల్ల లేక

మస్తిష్కం మళ్ళీ స్తంభించింది !

తీవ్ర మైన నైరాశ్యం మిగిల్చింది !

ఈ లోగా ఎదో ఆలోచన !

 ముందుకెళ్ల లేక ఆగితే ఎలా ?

చేతకాదు అంటుంది ఈ సంఘం !

వెనక్కి వెళితే ఓడామని గేళి చేస్తుంది ఈ సమాజం .


ఈ సంఘం తో నాకెందుకు !!

గాలివానకు తల్లడిల్లుతుంటే గొడుగు పట్టిందా ఈ సమాజం !

నిద్రావస్థలో నున్నప్పుడు తట్టి లేపిందా ఈ సంఘం!

వారి వెక్కిరింతలకు నేనెందుకు స్పందించాలి!



గెలుపులో సహకరించక ఓటమిని ఎత్తి చూపే

వీరితో నాకేం పని !!


అనుకుంటూ కూలబడిన మనస్సు ......


అలలతో హోరెత్తుతున్న సముద్రమైంది !

గాలివానకు నేల రాలిన మహా వృక్ష మైంది !


ఈలోగా



చిన్న రెక్కలతో గాలిలోకి ఎగిరే పక్షి 

చిరు దేహంతో సముద్రాన్ని ఈదే చేప

మండే ఎండకు మోడై వానకు చిగురించే చెట్టు


పరిశ్రమించి గంగను నేలకు దించిన భగీరధుడు

వదులుకోని ఓరిమితో  పతి ప్రాణాలను  కాపాడిన  సావిత్రి 

ఆత్మవిశ్వాసం  తో  దేశం    నలుమూలలా తన  ఉనికి  చాటిన  ఆది  శంకరుడు  !

మనస్సును తట్టి......

శక్తిని  కూడగట్టి  !
అడుగులో   అడుగేస్తూ! 
గమ్యం వైపే  గమనాన్ని  సాగిస్తూ  !
ధైర్యం మనసున నింపి  !

ఓరిమితో గెలుపుకై  ప్రయత్నిస్తూ  విజయ  తీరాలను చేరాను  !

ఆనందపు అంబరాన  విహరించాను  !!

నిరంతరం పరిశ్రమిస్తూ  ముందుకు సాగితే  విజయం  వరిస్తుంది . నీ లక్ష్యం  సిద్ధిస్తుంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి