పేదవారు,
పీడితులు,
సంఘంచే
అంటరాని వారు అనబడేవారు,
అనాధలు,
వారి
వారి గుండెల్లొ వేదనలను
కవితలుగా వ్రాస్తే, మొదట
రాయడానికి పదాలు దొరకవు,
రాసినా
చదివేందుకు ధైర్యం చాలదు.
వారి
ఆక్రందనలు, ఆక్రోశాలు,
ప్రస్పుటంగా
ఊహలకందని భాషల్లొ, పదాలతో
కవితంతా నిండి ఉంటాయి.
ఆ కవిత
చదివి అర్ధం చేసుకొని భరించగలిగే
శక్తి ఉంటే వారిని ఇలా ఈ సంఘం
పీడించదు. ఆ
కవిత రగిల్చే మంటల్లో మసై
పోతారు. వారిలో
ఇంత ఆక్రందన దాగుందా అని
ఆశ్చర్యంలో మునిగి తేలుతారు.
వారూ
మానవులే అని మరచి ఇన్నాళ్ళూ
కళ్ళు మూసుక పోయిన కుటిల
నాయకులంతా కంగారు పడతారు.
వారి
పట్ల సమాజం ప్రవర్తిస్తున్న
తీరు, వారిలో
ఆగ్రహాల జ్వాలలను రగిలించినా,
వారి
ఆకలి కేకలు సమాజం చెవిని
చేరుకున్న, వారి
చావులు సమాజం హృదయాన్ని
కరిగించకున్నా, గుండెలోతుల్లో
రక్తం మరుగుతున్నా, ఏమీ
చేయలేని నిస్సాహాయత,
ఎదిరించే
బలం లేదు. ఎదిరించినా
అణగార్చ బడ్డవారు. వారి
ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో
చెప్పలేం. ఊహించలేం
కదూ. అందుకే
వారి ఆవేశాలు,
ఆక్రోశాలు
కవితగా రాస్తే ఆ పదజాలం నిప్పులు
కక్కుతుంది. ఆ
కవితలు మంటలు రేపుతాయి.
పేలిన
అగ్ని పర్వతంలాగా లావా చిందిస్తూ
వారి హృదయాంతరాళాల నుండి
ఒక్కసారిగా పెల్లుబికిన
కవితాగ్ని కణాలకు ఎదురు నిలువ
లేక సమాజం భీతిల్లవచ్చు.
27, డిసెంబర్ 2012, గురువారం
కవిత
ఏదో
కాగితం కలంపట్టి
కాస్త
ఆలోచించి రాసేది
కవిత కాదు
మనసు
స్పందించి
హృదయపు
లోతులనుండి
ఆర్ద్రత
తో బయటకు పొంగే
భావనే
నిజమయిన కవిత
కవిత మనసులో
మాటను చెప్పాలి
కవిత మనిషి
ఆలోచనలను
కాగితం పై
ఉంచాలి
కవిత జనం
గుండెల్ని తాకేలా ఉండాలి
కవిత వ్యవస్థ
బాగోగులను కోరాలి
కవిత సమాజంలో
మార్పును కోరాలి
కవిత మంచిని
ప్రభొదించాలి
కవిత
కవి వ్యక్తిత్వానికి దర్పణం
కావాలి !!
చిరునవ్వుల చిన్నారి
చిరునవ్వుల
చిన్నారివే
వరమల్లే
దొరికావే
!
సిరిమల్లెల
సింగారివే
నా
మనసే దోచావే
!!
జడివానలో
తడిసి నీవు
నెరజానల్లే
వస్తవుంటే
తడిసిన
నీ సోకుసూసి
నా
గుండె జల్లుమందె
!
నా
వళ్ళు జిల్లుమందె
!!
పరుగున
ఇంటికి సేరి
నేతచీర
గట్టి
తలార
బోసుక కూకంటే
నా
మనసు వల్లనందే
!
నా
వయసు ఆగనందే
!!
తెల్లవారే
యేళ
మంచుకురిసిన
నేల
వయ్యారంగా
కూకొని
నువ్వట్ల
ముగ్గెడుతూ
నన్నట్ల
కవ్విస్తాంటే
నిన్నెట్ట
విడిసేదే ఓ పిల్ల
!
నన్నునే
మరచానే నా పిల్ల
!!
కళ్ళకాటకనెట్టి
జడన
మల్లెలు చుట్టి
వంటికి
ఓణీ కట్టి
నీవట్ట
తిరుగుతాంటే
నే
గుట్టుగెట్టుండేదే ఓ పిల్ల
!
నిన్ను
చుట్టుకుంటానే నా పిల్ల
!!
తొలకరి
బీటలు
వారిన భూమి చినుకు స్పర్శకు
పరవశించి
పరిమళించింది !!
ఆ
పరిమళం ఆస్వాదించి మనసు
ఆనందించింది
దాహార్తితో
అలమటించిన జనం
గొంతులు
తడిపింది
తొలకరి
చినుకు తాకిన
అనుభూతి
మదిని తాకింది
తడి
ఆవిరి అయిన మోములలో
ఆనందపు
తడి తాండవించింది
చెట్టు
పుట్ట,
కొండ,
బండ
వేడినిట్టూర్పులు
మరచి
కాస్త చల్లబడ్డాయి !!
తొలకరి
తో ఆనందించిన రైతన్న
నాగలితో
కదిలాడు
పొలం
పనులు మొదలంటూ రెండు నెలల
విశ్రాంతికి
వీడ్కోలు పలుకుతూ వ్యవసాయ
కూలీలు
అటకెక్కించిన
పుస్తకాల బూజు దులుపుతూ,
స్కూలు
యూనిఫామ్ ధరించి
వెనుక
పుస్తకాలను తగిలించి
ఆట
పాటలకు సమయం తీరిందంటూ
కదిలిన
విద్యార్ధులు,
ఎటు
చూసినా హడావిడే !!
తొలకరి
తెచ్చింది కోలహలం
తొలకరి
ఇచ్చింది ఆనందం
తొలకరి
పనులకు నాంది పలికింది
తొలకరి
ఇక లేవండంటూ పిలుపందించింది
తొలకరి
సోమరితనాన్ని వదిలించింది
శ్రమించండంటూ
వర్తమానం అందించింది !!
4, డిసెంబర్ 2012, మంగళవారం
జలం - గళం
చినుకు చినుకు కలిస్తేనే
జలం
పాయ పాయ కలిస్తేనే నదీ
ప్రవాహం
చేయి చేయి కలిపి ముందుకు
సాగితే అది సమైక్యవాదం
గళం గళం కలిపి పోరు బాట
పడితే అది విప్లవ గీతం
ప్రవాహ వేగాన్ని ఏ ఆనకట్ట
నిరోధించగలదు
రగులుతున్న గుండె ఘోషలను
ఏ నిశ్శబ్దం దాచగలదు
హిమం కరిగితే జీవనది
గుండె కదిలితే విప్లవ
ఝరి
నీరు ఎండితే ఎడారి
గళం ఆగితే వ్యవస్థ పెడదారి
కల్మషం కడుగుతూ సాగింది
ఆ నదీ ప్రవాహం
ప్రక్షాళనే లక్ష్యంగా
కదలాలి ఉద్యమ సైన్యం
తప్పుని ప్రశ్నించు
దారుణాన్ని ఖండించు
దౌర్జన్యాన్ని నిర్జించు
మంచికై ఉద్యమించు.
భగత్
సింగ్
చిరుత
ప్రాయముననే హృదయమున దేశభక్తిని నింపి
కలనైనా
భరతమాత దాస్య సృంఖలాలను మరువక
నిలువునొచ్చి
పడిన నీలలోహిత కిరణపు
చురుకుకు
చురుకున లేచి చకచక కదిలి
అదరక బెదరక
అలుపెరుగక సవ్యసాచై
ఎదురొచ్చిన
ఓడ్పులను ఓర్పుతో జయిస్తూ !
నింగికెగసిన విశ్వాసంతో, పలుదిక్కుల
పదునెక్కిన
మాటలతో, పాతాళాన ఉన్న భావనల్ని
యువత నషాళానికంటించి,
పెను ఉప్పెనలా
గర్జించిన
సింహంలా, ఓ విప్లవం తెచ్చావు
దుష్టశక్తుల
చేత చిక్కి ప్రాణార్పణ చేశావు
భరతజాతి
స్వాతంత్ర్య సమర దీపికవయినావు
మన జాతి
గుండెల్లో అమరుడవయినావు
జోహార్
భగత్ సింగ్ జోహార్ !!
6, జూన్ 2011, సోమవారం
స్వేచ్ఛ
స్వార్థమనే పెను చీకటి మనసుని ఆవహించి
అసత్యం నా నాలిక పై తాండవం ఆడింది!
క్రూరత్వం మానవత్వం పై పంజా విసిరింది!
జాలి లేని నా మనసు వికటాట్టహాసం చేసింది!!
మంచిని హేళన చేస్తూ!
శాంతిని కనుమరుగు పరుస్తూ!
అరాచకం ప్రభలిస్తూ!
దుర్మార్గం కొమ్ము కాస్తూ!!
సాగిన నా జీవన పయనంలో
వికసమే లేక, ఈ ప్రపంచాన్ని చూడనీక
అహం నా మనసుని కప్పేసింది!
చుట్టూ చీకట్లను నింపేసింది!!
ఏ ఉదయం నన్ను తట్టి లేపిందో
ఏ కిరణం నను చురుకున తాకిందో
ఆ ప్రభాత కిరణపు పలకరింపు
మనసును ఆవహించిన నిశను తరిమి కొట్టింది
కాళ రాత్రి పీడకలలను మట్టు పెట్టింది
అల్లుకున్న అహం అంతు చూసింది!
బందీ విడిన మనసు స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తూ
స్వార్థపు చీకట్లను తొలిగించి కాస్త ప్రపంచాన్ని చూస్తూ
మంచిని అన్వేషిస్తూ
మానవత్వాన్ని సోధిస్తూ
సంఘం ఎక్కడ ఛీ కొడుతుందో అని సందేహంతో
సిగ్గుపడుతూ,పశ్చాతాప పడుతూ
పూర్తి వెలుతురుని తట్టుకోలేక
తలుపులు తెరుస్తూ మూస్తూ
మనసు మౌనంగా రోదించింది!
గతం సింహావలోకనం చేసుకుంటే!
ఏముంది!
స్వార్థానికి నా మనసు బందీ అయ్యింది!
నేను అన్న అహం నరనరాలా నర్తించింది!
మార్గమే లేక జీవిత పయనం సాగింది!
శాంతిని కోల్పోయింది!
ఆ పొద్దు ఏమి జరిగిందో!
బరువెక్కిన హ్రుదయం తేలికయ్యింది!
మనసు తనకు తానే ప్రశ్నించుకుంది!
జీవన గమ్యం తెలుసుకోమంది!
స్వార్థం చెరనుండి విముక్తి కోరింది!
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఆహ్వానం పంపింది!!
అసత్యం నా నాలిక పై తాండవం ఆడింది!
క్రూరత్వం మానవత్వం పై పంజా విసిరింది!
జాలి లేని నా మనసు వికటాట్టహాసం చేసింది!!
మంచిని హేళన చేస్తూ!
శాంతిని కనుమరుగు పరుస్తూ!
అరాచకం ప్రభలిస్తూ!
దుర్మార్గం కొమ్ము కాస్తూ!!
సాగిన నా జీవన పయనంలో
వికసమే లేక, ఈ ప్రపంచాన్ని చూడనీక
అహం నా మనసుని కప్పేసింది!
చుట్టూ చీకట్లను నింపేసింది!!
ఏ ఉదయం నన్ను తట్టి లేపిందో
ఏ కిరణం నను చురుకున తాకిందో
ఆ ప్రభాత కిరణపు పలకరింపు
మనసును ఆవహించిన నిశను తరిమి కొట్టింది
కాళ రాత్రి పీడకలలను మట్టు పెట్టింది
అల్లుకున్న అహం అంతు చూసింది!
బందీ విడిన మనసు స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తూ
స్వార్థపు చీకట్లను తొలిగించి కాస్త ప్రపంచాన్ని చూస్తూ
మంచిని అన్వేషిస్తూ
మానవత్వాన్ని సోధిస్తూ
సంఘం ఎక్కడ ఛీ కొడుతుందో అని సందేహంతో
సిగ్గుపడుతూ,పశ్చాతాప పడుతూ
పూర్తి వెలుతురుని తట్టుకోలేక
తలుపులు తెరుస్తూ మూస్తూ
మనసు మౌనంగా రోదించింది!
గతం సింహావలోకనం చేసుకుంటే!
ఏముంది!
స్వార్థానికి నా మనసు బందీ అయ్యింది!
నేను అన్న అహం నరనరాలా నర్తించింది!
మార్గమే లేక జీవిత పయనం సాగింది!
శాంతిని కోల్పోయింది!
ఆ పొద్దు ఏమి జరిగిందో!
బరువెక్కిన హ్రుదయం తేలికయ్యింది!
మనసు తనకు తానే ప్రశ్నించుకుంది!
జీవన గమ్యం తెలుసుకోమంది!
స్వార్థం చెరనుండి విముక్తి కోరింది!
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఆహ్వానం పంపింది!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)