ప్రపంచం ముందంజ వేస్తుంటే
మనమెందుకు స్థిరంగా ఉండాలిమన పయనమూ ఆవైపే సాగాలి
అలుపెరుగక పరిశ్రమించి
ఆ బాటలో ముందే ఉండాలి!
అలా అని
ప్రపంచం ఎటు వెళ్తుందో
అటే మన పయనమా!కాస్తంత గమనించి చూస్తే
మనసుకి తెలుస్తుంది!
ఆ బాట పయనించ దగ్గదో
వెలివేయ దగ్గదో!!
గొర్రెల మందల్లే కాక
మంచీ చెడులను విశ్లేషించివిచక్షణతో ముందుకు సాగాలి
ఆనందంతో ఆదర్శ జీవితం సాగించాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి