ఉండాలోయ్ ఆవేశం!
చెడుపై పోరాడేందుకు
దుర్మార్గాన్ని అంతమొందించేందుకు
కావాలోయ్ ఆలోచన!
మంచేదో చెడేదో గ్రహించేందుకు
ఉత్తమోత్తమ నిర్ణయాలు తీసుకొనేందుకుఆచితూచి అడుగులేసేందుకు
ఉండాలోయ్ ఆత్మస్థైర్యం!
ఎన్ని కష్టాలొచ్చినా ఎదురు నిల్చేందుకు
ఏ పనయినా విజయవంతంగా ముగించేందుకుఓటమిలోనయినా క్రుంగక విజయంకై పోరాడేందుకు
కావాలోయ్ మానవత్వం!
మనిషిని మనిషిగా చూసేందుకు
ఆపదలో ఉన్నవానిని ఆదుకునేందుకుఆకలితో ఉన్నవానికి సాయం అందించేందుకు
ఉండాలోయ్ ప్రేమానురాగం!
హాయిగా జీవించేందుకు
శాంతంగా బ్రతికేందుకుతోడునీడలను పొందేందుకు
కొంచెం శాంతం!
కొంచెం విచక్షణ!కొంచెం వినమ్రత!
ఇవన్నీ కావాలోయ్!
పరిపూర్ణ వ్యక్తిగా ఎదగేందుకు
పరిపక్వ జీవితం పొందేందుకు
నలుగురి లో నేనై
నేనే నలుగురి నై బ్రతికేందుకు
ఉన్నత జీవన పయనం సాగించేందుకు!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి