అరవది ఆరు వసంతాల
స్వతంత్ర్య భారతి వైభవాన్నిసింహావలోకనం చేసుకున్న నాకు!
కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకూ
సౌరాష్ట్రం నుండి సిక్కిం వరకూదర్శనమిచ్చింది
అరాచకం, పైశాచికం, అవినీతి, పేదరికం!
గుప్పెడు మెతుకులు దొరకక
ఎంగిలి మెతుకులకైఆశగా చూస్తూ
డొక్కలు ఎండుక పోయి
ఎముకలు గూడయిన
జీవశ్చవాలు అడుగడుగునా కనిపించాయి!
కన్నీరు కార్చేందుకు
కళ్ళలో చెమ్మలేని బ్రతుకులు దర్శనమిచ్చాయి!!
కామంతో కళ్ళు మూసుకపోయి
పశువుల కంటే హీనంగావావివరసలు, చిన్నపెద్ద లేకుండా
అతివలపై, పసికందులపై
అత్యాచారలకు తెగబడుతున్న
ఛండాలురు అడు గడుగునా
మేకుల్లా దారిన తగిలారు!
ఆ అతివల ఆవేదనలకు
ఆక్రందనలకు పట్టీపట్టనట్లువినీవిననట్లుగా చూస్తున్న
ఈ సమాజాన్ని గమనించాను
ఖఠినమయిన చట్టాలు తేలేని
ఈ సిగ్గులేని పాలకుల్ని చూశాను!
ధనదాహం, స్వార్దంతో
నిండిన మనసులతోభూముల్ని కబ్జా చేస్తూ
గనుల్ని ఆక్రమించుకుంటూ
దొరికింది దొరికినట్లుగా
దోచుకుంటున్న ఈ పాలకులు!
"దొంగ లంజాకొడుకులు అసలే
మసలుతున్న ఈ లోకంలో"అని ఆవేశంలొ పలికిన శ్రీశ్రీ
గళం, కలం పదును
నేటి ఈ దుస్థికి అద్దం పడుతుంది.
వీళ్ళు వదిలిందేదీ లేదు!
పశుగ్రాసాల్ని
రక్షణ ఆయుధాల్ని
శవ పేటికల్ని
ప్రక్రుతి వనరుల్ని
ఇలా ఎన్నని చెప్పాలి!
రోజుకో కుంభకోణం!
అవినీతి నిరోధక శాఖనే
అవినీతి బాట పట్టించిన
సమర్ధులు ఈ దేశమంతా నిండి యున్నారు!
ఎంతో మంది మహానీయులు ప్రాణాలర్పించి
జైళ్ళల్లో మగ్గి, బ్రిటీషువారి లాఠీలదెబ్బలకు ఓర్చిసాధించిన స్వాతంత్ర్యం ఇందుకేనా!
జాతి సంపదను దోచుకొనే ఆమోదమా ఈ స్వాతంత్ర్యం!
పైశాచికం తో పైబడి అతివల ఉసురు తీయడంకేనా ఈ ...!
దోపిడికీ, అరాచకానికి దౌర్జ్ఞన్యాలకు అడ్డు లేకపోవడమేనా ఈ స్వాతంత్ర్యం !!
ఇదంతా చూస్తుంటే స్వాతంత్ర్యం
రాకున్నా బాగుండేదేమో !!మనస్వేచ్ఛను మనమే హరించుకునే
మన శాంతిని మనమే చంపుకునే
మన జాతిని మనమే నాశనం చేసుకునే
ఈ స్వాతంత్ర్యం మనకొద్దు!
స్వాతంత్ర్యం అంటే!
శాంతినిచ్చేది!అభయాన్నిచ్చేది!
అభివృద్ధినిచ్చేది!
మానవత్వం పెంపొందిచేది!
ఇవేమి ఇవ్వని ఈ స్వాతంత్ర్యం మనకొద్దు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి