కలంతో
రాసినా
గళంతో
పలికినా
పెల్లుబుకుతున్న
ఆవేశాలకు
ఇవి
ప్రతిరూపాలే!
జరుగుతున్న
దారుణాలకు
ఇవి
నిలువుటద్దాలే!
రోజుకో
దారుణం
పూటకో
కీచక
పర్వం
ఎటు
చూసినా,
ఏ
వైపువిన్నా
కళ్ళకు
కనబడుతూ
చెవులకు
వినబడుతూ!
తల్లి
లేదు
పిల్లని
లేదు
పెద్ద
లేదు
చిన్న
లేదు
కంటికి
కనబడితే
చాలు
మృగాల్లా
దూకి
పశువులా
అనుభవించి
ప్రాణాలు
తీస్తున్నారు
క్షణికావేశాలకు
నూరేళ్ళు
బలి
చేస్తున్నారు!
ఇవన్నీ
మనసును
చేరి
స్త్రీని
గౌరవించే
భారతమేనా
ఇదని
మనసు
కలవరపడి
ఏమి
చేయలేని
నిస్సాహాయతో
క్షోభపడి!
జరుగుతున్న
దారుణాలకు
బాధ
ఇంతింతై
కొండంతై
మండే
అగ్ని
పర్వతమై!
ఒక్కసారి
బ్రద్దలై
ఈ
కవితగా
బయటపడింది
ఈ
మండుతున్న
లావాను
ఏ
తుఫానూ
చల్లార్చలేకపోతుంది!
కుక్కాల్లా,
పోట్లగిత్తల్లా
ఊరిపైబడి
ఈ
దారుణాలు
చేస్తుంటే
ఏమీ
చేయని
పాలకులు
"ఇది
సహజమే"
అనే
పలుకులు
ఆ
అగ్నికి
ఇంకా
ఆజ్యం
పోస్తున్నాయి!
సాంప్రదాయం,
సంస్కృతి
గల
దేశమని
గొప్పలు చెప్పి
డప్పులు
కొడుతున్నాం!
అసలు
బండారం
బయట
ప్రపంచానికి
కనిపిస్తూనే
ఉంది
రక్షణలేని
సమాజంలో
జీవిస్తున్నామని
తెలుస్తూనే
ఉంది.
మనల్ని మనం సరి చేసుకోలేమా?
ఈ మానవ మృగాల్ని ఏమీ చేయలేమా?
జాగు చేస్తూ మీనమేషాలు లెక్కెట్టడమెందుకు?
అంతా జరిగాక వెర్రిమొహాలు వేయడమెందుకు?
ఇదే సరయిన సమయం!
కదలండి!
లా పుస్తకాలు తిరగెయ్యండి!
క్లాజులు, సెక్షన్లూ తగిలించండి!
చట్టాల్లో మార్పు తెండి!
తప్పెందుకు చేశామురా అనేలా!
తల ఎత్తేందుకు భయపడేలా!
ఈ బ్రతుకెందుకని బాధపడేలా!
మనిషికి కాదు మనసుకి తగిలేలా!
ఇలాంటప్పుడే!
మానవ హక్కుల గూర్చి మాట్లాడొద్దు!
ఏ జాలీ కనికరాలొద్దు!
ఉపేక్షిస్తూ పోతుంటే
ఊరంతా వీరే అవుతారు!
పశ్చాత్తాపం అనే పదాలు వాడొద్దు!
అబల ప్రాణం హరించుక పోయాక
మానవత్వం మాటేందుకు?
పశ్చాత్తాపానికి వదులుతార్లే అని
ఇంకోడు ఆ దారే పడతాడు!
చట్టాన్ని చులకన చేస్తాడు!
అది కాదు, అలా కాదు!
చట్టాలు చేస్తే!
శిక్షలు అమలు చేస్తే!!
నిద్రలోనయినా ఆలోచనొస్తే
ఆ చట్టం గుర్తొచ్చి చమటలు కక్కాలి!
వెన్నంతా వణుకు పుట్టి జ్వరం రావాలి!
ఇక నా వరకయితే
ఈ మాటల తూటాలను వాళ్ళ గుండెల్లో దించాలనుంది!
నా కవితలనే నిప్పుకణికలతో తగలెయ్యాలని ఉంది!
ఈ ఆవేశపు బడ భాగ్నులలో కాల్చేయాలని ఉంది!
ఈ కీచకుల్ని నపుంసకుల్ని చేసి వదలాలనుంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి