స్వతంత్ర భారతికి గ్రహణం పట్టింది!
సువర్ణ భారతి శూన్యమయ్యింది!
అదృష్ట ఆకాశంలో అదృశ్యమయ్యింది!
సూర్య చంద్రులకు రాహుకేతువులయితే
భరత భూమికి రాహు కేతువులెన్నో ఎన్నెన్నో
రాజకీయం, అవినీతి, అరాచకం, ఉగ్రవాదం, మతవాదం!
కపట రాజకీయపు క్రీడలకు చీకట్లు కమ్మి
ఉగ్రవాదం విసురుతున్న పంజాలకు చిక్కి
అవినీతి సర్పం విషం కక్కుతుంటే
అరాచకం పలు దిక్కులా ప్రబలుతుంటే
దేశ ప్రగతి కుంటు పడింది
ప్రజల బ్రతుకు అధోగతి పాలయ్యింది!!
కమ్ముకున్న చీకట్లకు
కనపడని దారులెంట గుడ్డిగా నడుస్తూ
రక్షణే లేని సమాజంలో
బిక్కు బిక్కున బ్రతుకులీడిస్తూ
దగాపడిన సామాన్యుడి బ్రతుకు బండి
ఏ గోతిలో ఇరుక్కుంటుందో
ఇరుసు విరిగి కూల బడుతుందో!!
సూర్య చంద్రుల గ్రహణం కొన్ని గంటలు!
ఈ భరత భూమికి గ్రహణం ఎనాళ్ళో ఎన్నేళ్ళో!!
బాగా వ్రాశారు. ఇంకా ముందుకు వెళ్ళి, ఈ కవిత ఎందుకు వ్రాయాలనుకున్నారు? దానికి స్పూర్తి ఏమిటి? ఏ ఏ విషయాలను మీరు పరిగణలొకి తీసుకున్నారు? ఉదాహరణలు ఎమైనా ఇవ్వగలరా? solutions ఏమైనా propose చెయ్యగలరా?
రిప్లయితొలగించండిస్పూర్తి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. నిత్యం మనం చూస్తున్న విషయాలే స్పూర్తి . ఇక solution ante పాక్షికంగా నేను రాసిన ఇంకో వ్యాసం లో మీకు దొరుకుతుంది.
రిప్లయితొలగించండిhttp://ganesh-ganeshnarapara.blogspot.com/2010/03/blog-post_31.html
రిప్లయితొలగించండిone suggestion/request:
రిప్లయితొలగించండిPlease use the archives widget - helps us navigate old posts easily. Thank you