గెలుపు బాటలో పయనిస్తుంటే నీ వెంటే మేమన్నారు!
కాస్త తడబడితే దూరంగా ఆగి చూసారు!
ఓటమికి చేరువవుతుంటే ఒంటరిని చేసి దోషాల్ని వెతికారు!
ఇది లోకం తీరు!
కాసేపు అలసి కూర్చుంటే పోరాడే గుణం లేదన్నారు!
నిదానంగా అడుగులేస్తుంటే ఈ వేగం చాలదన్నారు!
పోనీలే అని పరుగు తీస్తే అంత దూకుడు తగదన్నారు!
ఇక నా వల్ల కాదంటూ సాయం కోరితే పలుకక మిన్నకున్నారు!
ఇంకాస్త బ్రతిమి లాడితే తలోదారి చూసుకున్నరు!
ఇది లోకం తీరు!
నీతికివి రోజులు కావన్నారు!
న్యాయం బ్రతకలేదన్నారు!
శాంతి కనుమరుగయ్యిందని వాపోయారు!
కళ్ళ ముందు గలాటాని చూసి పక్కకి తప్పుకున్నారు!
నా కెందుకొచ్చిన గొడవంటూ ఇంటి తలుపు మూసుకున్నారు!
ఇది లోకం తీరు!
మానవత్వం అని మాటలు చెప్పారు!
ప్రేమ చూపాలని ప్రభోధాలు పల్కారు!
జాలి వుండాలని నినాదాలూ చేసారు!
బ్రతుకు బాటలో గతి తప్పిన జీవాల్ని చూసి నవ్వుకున్నారు!
సాయం కోరితే విసుకున్నారు!
ఇది లోకం తీరు!!
సలహాలు ఇవ్వమంటె సర్వం మరచి చెబుతారు
రిప్లయితొలగించండిమరి సాయం చెద్దామంటె సారి పని వుందంటు సైడైపొతారు
లొకం తీరు ఇంతే
chaal bagundandi mee blog. meeru chandrasekhar gari abbaaya?
రిప్లయితొలగించండిthank you very much. nenu vaari abbaini kaadu
రిప్లయితొలగించండిbrilliant!
రిప్లయితొలగించండిAlso liked Rajnikanth's extension
Em raasaavu guroo! kotta paaLee ceppinaTlu -"Brilliant"
రిప్లయితొలగించండి-paata cemcaa