3, ఆగస్టు 2020, సోమవారం

12, మార్చి 2020, గురువారం

బ్రతుకు పయనం






11, మార్చి 2020, బుధవారం

జీవన గమనం -II





శ్రీ శ్రీ కవిత్వం




జీవన గమనం-I









26, నవంబర్ 2019, మంగళవారం

మాతృ భాష

జగన్మాత వంటి అందమైన భాష
తల్లిపాలవంటి  శ్రేష్ఠమైన భాష
పంచభక్షాల వంటి రుచి ఐన భాష
మకరందం వంటి  కమ్మనైన భాష
ప్రకృతి వంటి రమ్యమైన భాష
వెన్నపూస వంటి  మృదువైన  భాష
మన మాతృ భాష !

మాటలాడుటకు సులువైన భాష
ఆకళింపునకు వీలైన భాష
పరాచకమునకు అనువైన భాష
పద ప్రయోగాలకు    సరళమైన భాష
వూసులాడుటకు  ఉచితమైన  భాష
భావ ప్రకటనకు ముఖ్య మైన భాష
మన మాతృ భాష !

మాతృ భాషలో

ఆర్థ్రత కు చోటుంది !
అవేదనకు వీలుంది  !
ఆనందానికీ అవకాశముంది !
ఆక్రోశానికీ  మార్గముంది!  

కన్నీటికీ ఓ  మాటుంది
దానికి మాతృభాషలోనే  అర్థముంది!

వేదనకీ ఓ రూపముంది
దానికి మాతృభాషలోనే  తగిన స్థానముంది !

జీవితంలోని అన్ని రసాల్ని పలికించేందుకు    
మాతృభాష రంగస్థలమవుతుంది
సహజంగా వాటిని పలికించి రక్తి కట్టిస్తుంది!

పరాయి భాష
తెచి పెట్టుకున్న  నటనలా సాగుతూ
అర్థం కాని భావాల్ని ప్రకటిస్తూ  
రక్తి కట్టని నాటకం లా ముగుస్తుంది
లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది     


1, సెప్టెంబర్ 2019, ఆదివారం

సంబరాలు వద్దు


ఎంతో మంది బలిదానలు, త్యాగల ఫలితం ఈ స్వాతంత్ర్యం. ఇంత కష్టపడి సాధించుకున్న స్వాతంత్ర్యం దుర్వినియోగం చేస్తూ ....



ప్రజలను నిలువునా దోపిడి చేస్తున్న ఈ రాజకీయ నాయకులు ఎదిగారని  చేయమంటారా వేడుకలు!

మారు మాట  లేకుండా మెదడులో ఆలోచన లేకుండా వీరినే ఎన్నుకుంటున్న జనాల వికాసాన్ని చూసి చేయమంటారా వేడుకలు!
    
ఆకలి, పేదరికం రూపు మాపని ఈ ప్రభుత్వాల తీరుకి నీరాజనాలు చెబుతూ చేయమంటారా వేడుకలు !

పురుడు పొయ్యడానికి నిండు గర్భిణిని కర్రలకు కట్టి మైళ్ళు మైళ్ళు మోసకెళ్ళే గిరిజన ప్రాంతాలున్నాయని చేయమంటారా వేడుకలు !

పసిపిల్లన్ని సైతం అత్యాచారలు చేస్తున్న వారిని శిక్షించే చట్టాలు తయారు చేయలేని స్థితిలో ఉన్నామని చేయమంటార సంబరాలు !

దోమకాటుకే ప్రాణం  పోయే స్థితిలో ఉన్నాం!
నగరం నడిబొడ్డున గాలి పీలిస్తే చచ్చే స్థితిలో ఉన్నాం!
నీళ్ళు తాగితే రోగాలు వచ్చే కాలంలో ఉన్నాం!

నూనె  కల్తీ, తిండి కల్తీ, పాలు కల్తీ
పండ్లు కల్తీ, అంతా కల్తీ కల్తీ!

ఈ దుస్తితికి కారణం  మనమే!
వ్యక్తి లోని దుష్టభావమే సమాజంలో ప్రతిబింబింస్తుంది !
వ్యక్తిత్వ వికాసమే దేశ సౌభాగ్యం!
వ్యక్తిగతంగా మనలో మార్పు  రావాలి!

ఈ స్వతంత్ర్య దినోత్సవ సందర్భముగా ప్రతి ఒక్కరూ ప్రమాణం  చేసుకొందాం 

తోటివాడ్ని ప్రేమించక పోయినా పరేదు కానీ వానికి హాని మాత్రం చేయనని !
ప్రక్రుతితో నడుస్తూ దాన్ని  కాపాడుకుందామని  !
కాలుష్య నివారణకు కలిసి శ్రమిద్దామని!
సమాజ క్షేమమే మన  సంక్షేమమని! 
విద్యా ఆరోగ్య అభ్యున్నతి కోసం పోరాడదామని!
ఆలోచనతో, విచక్షణతో నాయకుడ్ని ఎన్నుకుందామని!!