26, నవంబర్ 2019, మంగళవారం

మాతృ భాష

జగన్మాత వంటి అందమైన భాష
తల్లిపాలవంటి  శ్రేష్ఠమైన భాష
పంచభక్షాల వంటి రుచి ఐన భాష
మకరందం వంటి  కమ్మనైన భాష
ప్రకృతి వంటి రమ్యమైన భాష
వెన్నపూస వంటి  మృదువైన  భాష
మన మాతృ భాష !

మాటలాడుటకు సులువైన భాష
ఆకళింపునకు వీలైన భాష
పరాచకమునకు అనువైన భాష
పద ప్రయోగాలకు    సరళమైన భాష
వూసులాడుటకు  ఉచితమైన  భాష
భావ ప్రకటనకు ముఖ్య మైన భాష
మన మాతృ భాష !

మాతృ భాషలో

ఆర్థ్రత కు చోటుంది !
అవేదనకు వీలుంది  !
ఆనందానికీ అవకాశముంది !
ఆక్రోశానికీ  మార్గముంది!  

కన్నీటికీ ఓ  మాటుంది
దానికి మాతృభాషలోనే  అర్థముంది!

వేదనకీ ఓ రూపముంది
దానికి మాతృభాషలోనే  తగిన స్థానముంది !

జీవితంలోని అన్ని రసాల్ని పలికించేందుకు    
మాతృభాష రంగస్థలమవుతుంది
సహజంగా వాటిని పలికించి రక్తి కట్టిస్తుంది!

పరాయి భాష
తెచి పెట్టుకున్న  నటనలా సాగుతూ
అర్థం కాని భావాల్ని ప్రకటిస్తూ  
రక్తి కట్టని నాటకం లా ముగుస్తుంది
లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది     


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి