చదివినవారి అభిప్రాయాలు
నా లోని నేను' ఈ పుస్తకం పేరు చూసి, 125 పేజీలతో వుంటే చాలా సాధారణంగా ఉంటుందని
అనుకున్నాను కానీ కిషోర్ కుమార్ గారి మొదటి రెండు రచనలు మార్పు-1, మార్పు-2 లాగే
ఎంతో లోతుగా ఆలోచించే విధంగా వుంది. కిషోర్ కుమార్ గారి రచన ఎంతో సరళంగా పిల్లలకి
సైతం అర్ధమయ్యే రీతిలో వుండి, చదువుతున్నది కళ్ళకి కట్టినట్టుగా వుండటం వలన
ఒక్కసారి చదవటం మొదలు పెడితే దృష్టి మరల్చాలని అనిపించదు. మధ్యమధ్యలో వచ్చే కవితలు
సైతం సరళంగా కనిపించినప్పటికీ వాటిని చదువుతుంటే రచయిత యొక్క లోతైన భావాలు చక్కగా
అర్థం అవుతుంటాయి. ఈ పుస్తకం లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీనిని చదువుతున్నంత
సేపూ అందులోని ఇల్లు, పరిసరాల వర్ణన మూలంగా మనం కూడా కథలోనే వుండి జరుగుతున్నది
చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కథను విభజించిన విధానం చాలా బాగుంది. మిగిలిన కథ
ఏంటి?ఎలా దొరుకుతుంది? ఎవరు చెప్తారు? అనే ఉత్కంఠ మనల్ని వేగంగా చదివేలా చేస్తుంది.
స్వప్నత్త గురించి తెలుసుకున్నపుడు మలుపు చాలా బాగుంది. ఇంత గంభీరమైన కథలో చిన్న
ప్రేమకథను ఎంతో అందంగా రాయగలగటం అనేది కిషోర్ గారి ప్రత్యేకత అని ఆయన రచనలను చదివిన
ఎవరికైనా అర్థం అవుతుంది. పిల్లల్ని ఎలా పెంచాలి అనే దగ్గర నుండి, స్నేహం, సమాజం
పట్ల బాధ్యత, బంధాలు, బంధాన్ని నిలబెట్టుకోవటం ఇలా అన్ని అంశాలు ఇంత చిన్న
పుస్తకంలో అంత వివరంగా రాయగల్గటం చాలా ఆశ్చర్యం గా అనిపించింది. 24 వ పేజీ లో ఉన్న
కవిత నాకు చాలా నచ్చింది. పుస్తకం చదవటం అయిపోయాక కూడా కాసేపు ఇంకా ఆ పాత్రల
గురించి ఆలోచిస్తాం అంటే అర్థం చేసుకోవచ్చు మనల్ని ఈ పుస్తకం ఎంత బాగా కదిలించింది
అనేది. చక్కటి తెలుగు నేర్చుకోవాలనుకునే వారూ, చక్కటి తెలుగు లో మంచి పుస్తకం
చదవాలి అనుకునే వారికి ఈ 'నా లోని నేను ' మంచి ఎంపిక.
RAMA SOWJANYA CHINTALAPATI
This Book is very well written and the way the author Kishore Kumar wrote the story is highly engaging. It tells how a person withstands in miserable moments. It tells how the person's decisions in anger impact the lives of the people around him. The drama/story the author narrated in this book is so intense and it connects to us deeply. We will get excited chapter by chapter while reading and surely will complete the whole book within no time.
RAKESH SHARMA
Book is available at
https://www.telugubooks.in/products/naloni-nenu-sagaramlanti-o-gatham